బాగుంది.కాం
శుక్రవారం, నవంబర్ 21 2008 | ఉదయం 6 గం 8 ని ( భారత కాలమానం ) బాగుంది.కాం వెబ్ సైట్ కు పునఃస్వాగతం!! english లో type చేయండి... తెలుగు లో చూడండి !! మార్పులు-చేర్పులు: సూచికలు-Bookmarks, తరచూ అడిగే ప్రశ్నలు, శ్రీశ్రీ రచనలు, GNU License యొక్క తెలుగు అనువాదం !!
 

తరచూ అడిగే ప్రశ్నలు

 

ఫోరములు అనగా నేమి?

ఫోరములు అనగా కంప్యూటర్ల సహాయముతో ఇంటర్నెట్ నందు ఏదైనా విషయము గూర్చి చర్చించుట. వీటిని వినియోగించి మీరు మీ ప్రశ్నలకు మరియు సందేహాలకు ఇతరులనుంచి సమాథానాలు పొందవచ్చు. లేక మీరే ఇతరుల సందేహాలకు సమాథానాలు ఇవ్వవచ్చు. అనగా, వీటి ముఖ్యోధ్ధేశం పరస్పర సహకారం.

తెలుగులో వ్రాయటం ఎలా?

ఇక మీరు తెలుగులో వ్రాయవచ్చు. మీ సౌకర్యం కోసం మీరు ఏదైనా సమాచారం వ్రయవలసిన సందర్భములో వెబ్ పేజికి కుడివైపున "తెలుగు కీ-బోర్డు" ప్రదర్శించబడుతుంది. (ఉదాహరణకు ఈ పేజ్ ను చూడండి). మొదట మీరు తెలుగులో వ్రాయ తలచిన "input field"లో "మౌస్ బటన్"ను "క్లిక్" చేయండి. (ఉదాహరణకు ఈ పేజ్ లో పేరు, రహస్యం మొ.. "input field"లు). తరువాత, మీరు వ్రాయ తలచిన తెలుగు అక్షరము పైకి "మౌస్ పాయింటర్"ను తీసుకెళ్ళి "మౌస్ బటన్"ను "క్లిక్" చేయండి. మీరు క్లిక్ చేసిన తెలుగు అక్షరము, మీరు సెలెక్ట్ చేసిన "input field"లో ప్రతిభింబిస్తుంది. ఈ విథముగా మీరు ఏ తెలుగు పదమునైనను "తెలుగు"లోనే వ్రాయవచ్చు. ఈ తెలుగు కీ-బోర్డు ప్రస్తుతానికి "మౌస్"తో మాత్రమే పనిచేస్తున్నది.

తెలుగు అక్షరాలు కనబడుటలే దా?

మీరు అధునాతన internet explorer బ్రౌజర్ వాడుతున్నారా లేదా సరిచూసుకోండి.

విండోస్ ప్లాట్ఫారంపై పనిచేసే తెలుగు ఫాంట్లు ఏవి?

ఇప్పటి వరకు తెలుగు ఫాంట్లను డి.టి.పి ని ద్రుష్టిలో ఉంచుకొని మాత్రమే డెవలప్ చేయుట జరిగినది. అటువంటి ఫాంట్లు వ్యాపారపరంగా విజయం సాధించినా, సామాన్యుడు కొనలేని విధంగా వాటి విలువ వేల రూపాయలు పలుకుతున్నాయి. అంతేకాక, అటువంటి ఫాంట్లు ఇంటర్నెట్ నందు వాడుటకు ఉపయోగకరంగా ఉండవు। అటువంటి క్రొన్ని ఫాంట్లు , వాటి హక్కుదారులు, సుమారుగా వాటి వెల క్రింద తెలుపబడినవి .
మరికొన్ని ఫాంట్లను విండోస్ అప్లికేషన్స్ కు వాడుట జరుగుతుంది. ఉదాహరణకు, మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ నందు, మాక్రోమీడియా ఫ్లాష్ నందు తెలుగు భాష వాడవచ్చు.
అలాగే, ఇంటర్నెట్ నందు వెబ్ సైట్లకు పలు రకాల ఫాంట్లను వాడటం జరుగుతుంది. అటువంటి కొన్ని ఫాంట్లు, వాటి వివరాలు క్రింద తెలుపబడినవి.

ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో కొన్ని తెలుగు వెబ్ సైటులు ఓపెన్ చేస్తే ఖాళీ డబ్బాలు వలె కనబడుతున్నాయి? ఎందుకు?

మామూలుగా, ఏదయినా వెబ్ సైటు ఓపెన్ చేసినప్పుడు, ముందుగా ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఓపెన్ చేయబడిన పేజినందు ఎటువంటి ఫాంటు వాడుటకు నిర్దేశించబడినదో గ్రహించి, అటువంటి ఫాంటును సిస్టమ్ ఫాంటు డైరెక్టరీ( C:\windows\fonts) నుండి డిస్ప్లే చెయుటకు వాడుతుంది. ఒకవేళ నిర్దేశించబడిన ఫాంటు "సిస్టమ్ ఫాంటు డైరెక్టరీ" నందు లేకపోతే, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ డీఫాల్ట్ గా ఖాళీ డబ్బాలను డిస్ప్లే చేస్తుంది. కాబట్టి, తెలుగు వెబ్ సైట్లు ఓపెన్ చేసేముందు, ఏదో ఒక తెలుగు ఫాంటును మీ సిస్టమ్ నందు ఇన్స్టాల్ చేయవలెను.

తెలుగు వెబ్ సైట్లకు ఎటువంటి తెలుగు ఫాంట్లు వాడాలి?

మీరు చూచే వెబ్ సైటుకు ఎటువంటి encoded fontను వాడుట జరిగినదో దానిని బట్టి మీరు ఎటువంటి తెలుగు పాంటు వాడవలెనో నిర్ణయించుట జరుగుతుంది. ఉదాహరణకు, బాగుంది.కాం వెబ్ సైటుకు తెలుగు యూనికోడ్ ఫాంటును వాడుట జరిగింది. కాబట్టి ఈ సైటును చూచుటకు మీరు ఏదయినా తెలుగు యూనికోడ్ ఫాంటును వాడవలెను. మైక్రోసాఫ్ట్ వారి గౌతమి ఫాంటు మరియు తిరుమల దేశికాచారి గారి పోతన ఫాంటు ప్రస్తుతము లభ్యమయ్యే తెలుగు యూనికోడ్ ఫాంట్లు. ఈ ఫాంట్లను వాడి మీరు బాగుంది వెబ్ సైటును చూడవచ్చు. అలానే ఈనాడు.నెట్ సైటు నందు ఈనాడు వారి స్వంత encoded font వాడుట జరిగింది. కాబట్టి ఈనాడు వెబ్ సైటు చూచుటకు మీరు ఈనాడు వారి ఫాంటు ఇన్స్టాల్ చేయవలెను.

నా విండోస్ సిస్టమ్ లో "గౌతమి" ఫాంటు ఫైలు కనబడుటలేదు

"గౌతమి" ఫాంటు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వారు డెవలప్ చేసిన తెలుగు యూనికోడ్ ట్రూ టైప్ ఫాంటు. ఈ ఫాంటుకు సంబంధించిన సర్వహక్కులు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వారివి. మైక్రోసాఫ్ట్ గౌతమి ఫాంటును విండోస్ XP నుండి డీఫాల్టుగా అందజేస్తోంది. కాబట్టి, మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ XP కంటే పాత వెర్షన్ అయినచో, మీ విండోస్ సిస్టమ్ లో "గౌతమి" ఫాంటు ఫైలు కనబడదు.

అయితే, పాత విండోస్ వెర్షన్ పై తెలుగు వెబ్ సైట్లు చూడటం వీలు పడదా?

వీలు పడుతుంది. మీరు మీ పాత విండోస్ సిస్టమ్ పై వెబ్ సైట్ సంభంధిత ఫాంటు మరియు అధునాతన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్(6.0) ను ఇన్స్టాల్ చేసిన, తెలుగు వెబ్ సైట్లు చూసే వీలు కలుగుతుంది. నూతన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్(6.0) నందు భారతీయ భాషలకు అనుగుణంగా "ఫాంట్ రెండరింగ్ ఇంజన్"ను మార్చుట జరిగినది.

అయితే, ప్రతీ తెలుగు వెబ్ సైటుకీ ఫాంట్లు ఇన్స్టాల్ చేయవలెనా?

ప్రతీ వెబ్ సైటుకీ మీరు ఫాంట్ ఇస్టాల్ చేయవలసిన అవసరం లేదు. ఒకసారి మీరు ఫాంటు ఇస్టాల్ చేసిన, అటువంటి ఫాంటు ఉపయోగించే ఎటువంటి వెబ్ సైటు నైనను మీరు చూడవచ్చు. మరి కొన్ని వెబ్ సైట్లకు "embedded font technology"ని వాడుట జరుగుతుంది. అటువంటి సైట్లకు, మీరు ఎటువంటి ఫాంటు ఇన్స్టాల్ చేయవలసిన అవసరమూ లేదు.


Copyright © 2003-2004, www.baagundi.com. All Rights Reserved.