| శుక్రవారం, నవంబర్ 21 2008 | ఉదయం 6 గం 19 ని ( భారత కాలమానం ) |
|
శ్రీశ్రీ రచనలు
పూచీ వహించబడదు
ఈ సైటు నందు పొందుపరచబడినటువంటి శ్రీశ్రీ రచనలు, మరియు ఇతర శ్రీశ్రీ సంబంధిత సమాచారం కేవలం స్వంత అభిరుచి మేరకు ఈ సైటు నందు ప్రచురించుట జరిగినది. ఇతరులు ఈ ప్రచురణను దుర్వినియోగ పరచిన, బాగుంది డాట్ కాం అందుకు భాధ్యత వహించదు. ఈ ప్రచురణను కాపీరైట్ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడిన, సంబంధిత వ్యక్తులు/సంస్థ విజ్ఞప్తి మేరకు ఈ ప్రచురణ మా సైటు నుండి తొలగింపబడుతుంది
|
మహాప్రస్థానంమరో ప్రపంచం,మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! పోదాం, పోదాం పైపైకి! కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హ్రుదాంతరాళం గర్జిస్తూ- పదండి పోదాం, వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం? దారిపొడుగునా గుండె నెత్తురులు తర్పణచేస్తూ పదండి ముందుకు! బాటలు నడచీ, పేటలు కడచీ, కోటలన్నిటిని దాటండి! నదీ నదాలూ, అడవులు, కొండలు, ఎడారులా మన కడ్డంకి? పదండి ముందుకు! పదండి త్రోసుకు! పూదాం, పోదాం, పైపైకి! ఎముకులు క్రుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరులారా! చావండి! నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండి! "హరోం! హరోం హర! హర! హర! హర! హర! హరోం హరా!" అని కదలండి! మరో ప్రపంచం, మహా ప్రపంచం ధరిత్రినిండా నిండింది! పదండి ముందుకు, పదండి త్రోసుకు! ప్రభంజనంవలె హోరెత్తండీ! భావ వేగమున ప్రసరించండీ! వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి! పదండి, పదండి, పదండి ముందుకు! కనబడలేదా మరో ప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని? ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు! తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్ జలప్రళయ నాట్యం చేస్తున్నవి! సలసలక్రాగే చమురా? కాదిది ఉష్ణరక్త కాసారం! శివసముద్రమూ, నయాగరావలె ఉరకండీ! ఉరకండీ ముందుకు! పదండి ముందుకు! పదండి త్రోసుకు! మరో ప్రపంచపు కంచు నగారా విరామ మెరుగక మ్రోగింది! త్రాచులవలెనూ, రేచులవలనూ, ధనంజయునిలా సాగండి! కనబడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు ధగధగలు, ఎర్రబావుటా నిగనిగలు, హోమజ్వాలల భుగభుగలు? |
శ్రీశ్రీ గురించి...
![]() పేరు: శ్రీశ్రీ అసలు పేరు: శ్రీరంగం శ్రీనివాసరావు జన్మస్థలం: విశాఖపట్నం జననం: ఏప్రిల్ ౩౦, ౧౯౧౦ మరణం: జూన్ ౧౫, ౧౯౮౩ రచనలు: మహాప్రస్థానం, ఖడ్గస్రుష్టి, ప్రజ, ఉక్కు పిడికిలి అవార్డులు: సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు : |